శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:17 IST)

24 గంటల్లో 12,689 కరోనా కేసులు

దేశంలోని గత 24 గంటల్లో కొత్తగా 12,689 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తాజా బులిటెన్‌ ను విడుదల చేసింది.

వాటి ప్రకారం.. 13,320 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య 1,53,587 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,59,305 మంది కోలుకున్నారు.

1,76,498 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 20,29,480 మందికి కోవిడ్‌ వ్యాక్సిన్లు వేశారు.