బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:10 IST)

కన్న కూతురిని గర్భవతిని చేసిన కసాయి తండ్రి.. కడుపు ఉబ్బెత్తుగా..?

కామాంధుల దుశ్చర్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా కన్నకుమార్తెను గర్భవతిని చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలో ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కమార్తె 9వ తరగతి చదువుతోంది. ఈ నేఫథ్యంలో, ఎనిమిది నెలల క్రితం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
కాగా, గురువారం పాఠశాలకు వెళ్లిన ఆమె కడుపు ఉబ్బెత్తుగా ఉండడం గమనించిన ఉపాధ్యాయులు ఆమెను కామక్కూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రా నికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, బాలిక ఎనిమిది నెలల గర్భవతిగా నిర్ధారణ అయింది. 
 
ఈ విషయమై బాలిక అవ్వ ఆరణి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు, బాలిక తండ్రిని అరెస్టు చేసి ఆరణి క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట హాజరుపరచి వేలూరు జైలుకు తరలించారు.