School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)
తమిళనాడు కడలూరులో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు, సెమ్మంకుప్పంకు సమీపంలో ఓ స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ దాటుతుండగా.. ఆ మార్గం గుండా వచ్చిన చిదంబరం రైలు స్కూల్ వ్యాన్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ కొన్ని మీటర్ల మేర రైలు లాక్కెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. రైలు వచ్చే సమయానికి ఆప్రాంత రైల్వే గేట్ మూతపడకుండా వుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.
మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మయిలాడుదురై మార్గాన వెళ్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం.