మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (14:15 IST)

చిక్కుల్లో జయప్రద.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

jayaprada
అలనాటి జయప్రద చిక్కుల్లో పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ఆమెకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.  
 
ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు జయప్రదపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో ఆమె కోర్టుకు హాజరుకాలేక పోయారు. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. 
 
ఈ కేసులో వచ్చే మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు జయప్రదకు వారెంట్ జారీ చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె రాంపూర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే.