భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు.. పిల్లలను కాలువలో పడేశాడు..
క్షణికావేశాలు మానవీయ సంబంధాలను మంటగలిపేస్తున్నాయి. చిన్న చిన్న కారణాల కోసం జనాలు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా యూపీకి చెందిన ఓ కిరాతకుడు భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు. అంతేకాదు ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలను ఓ కాలవలోకి తోసేశాడు.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ముజఫరానగర్‌కు సమీపంలో గల బసేదీ గ్రామానికి చెందిన పప్పూ కుమార్ గత మంగళవారం (37) తన భార్య డాలీ (36), పిల్లలు సోనియా (5), వంశ్ (3), హర్షిత (15 నెలలు)లను చంపేసి పరారయ్యాడు.
స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పప్పూ కుమార్‌ను అరెస్ట్ చేశారు. 15 రోజుల నుంచి శృంగారానికి నిరాకరిస్తోందనే కారణంతోనే తన భార్యను చంపేశానని పోలీసుల విచారణలో పప్పూ చెప్పాడు. అదే కోపంలో పిల్లలను ఓ కాలువలోకి తోసేసినట్టు చెప్పాడు. పిల్లల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.