గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసిన భర్త

honeymoon
అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను హానీమూన్‌కు తీసుకెళ్లేందుకు కట్టుకున్న భర్త ఏకంగా రూ.10 లక్షల మేరకు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత హానీమూన్‌కు తీసుకెళ్లి... అక్కడ భార్యతో అశ్లీల వీడియోలు తీశాడు. ఆ తర్వాత మరింత డబ్బులు కావాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బదాయూకు చెందిన నిందితుడు పీలీభీత్‌లో ఉంటున్న యువతిని ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. అతడు పెళ్లి తర్వాత తొలి రాత్రి జరుపుకోలేదు. అలా కొంతకాలంగా దూరం పెడుతూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన అత్తింటివారు ప్రశ్నించగా, రూ.10 లక్షలు ఇస్తేనే తన భార్యను హానీమూన్‌కు తీసుకెళ్తానని కరాఖండిగా తేల్చి చెప్పాడు. 
 
దీంతో వారు అతడికి రూ.5 లక్షలు ఇవ్వగా, ఈ నెల 7వ తేదీన భార్యాభర్తలిద్దరూ హానీమూన్‌ కోసం నైనిటాల్‌ వెళ్లారు. అక్కడ భార్యను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. మరో రూ.5 లక్షలు తీసుకురాకపోతే వాటిని వైరల్‌ చేస్తానని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు.. 13న తన పుట్టింటికి చేరుకుంది. ఆ తర్వాత బాధితురాలు అత్త, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.