ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (17:11 IST)

భార్యకు మత్తు ఇచ్చి ఫ్రెండ్స్‌తో రేప్, వీడియో తీసి ట్రిపుల్ తలాక్ అన్నాడు

వాడు కట్టుకున్న భర్త కాదు.. ఓ మృగాడు. కట్నపిశాచి. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఆ తంతును స్వయంగా వీడియో తీశాడు. ఆపై దాన్ని చూపించి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగులోకివచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సహరాన్పూర్‌లో అబ్దుల్లా దంపతులు నివసిస్తున్నారు. అబ్దుల్లా ఓ యువతిని చాలా ఏళ్లు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. మోజు తీరాక పెళ్లికి నిరాకరిస్తే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గత ఆగస్టు 16వ తేదీన ముస్లిం సంప్రదాయం మేరకు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టారు.
 
అయితే, తనను పోలీస్ స్టేషన్‌కు ఈడ్చి బలవంతంగా పెళ్లి చేసుకుందన్న కక్షతో లోలోపల రగిపోయాడు. దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా ఈనెల 3వ తేదీన ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. ఆమె నిద్రలోకి జారుకోగానే తన స్నేహితులు నలుగురితో అత్యాచారం చేయించాడు. దాన్ని తాను వీడియో తీశాడు. 
 
మత్తు వదిలిన తర్వాత ఏం జరగిందని భర్తను ఆమె నిలదీయడంతో జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. అయితే అబ్దుల్లా తెలివిగా భార్యకు ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. అయినా బాధితురాలు లెక్కచేయకుండా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.