శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (15:11 IST)

ప్రియురాలిపై అత్యాచారం చేసేందుకు వెళ్లి... కాల్చి చంపేశాడు... ఎక్కడ?

తనను పట్టించుకోకుండా మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ప్రియురాలిపై అత్యాచారం చేసి తగిన గుణపాఠం చెప్పాలని వెళ్లిన ప్రియుడు.. చివరకు ఆమెతో పాటు.. ఆమె సోదరుడిని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని కౌశాంబికి చెందిన షీలా(16) అనే యువతి తన తల్లిదండ్రులు, తమ్ముడుతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో యేడాది క్రితం ఆమెకు పుర్వా గ్రామానికి చెందిన గంగా ప్రసాద్(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ తరచూ మాట్లాడుతూ వచ్చారు. 
 
అయితే, ఉన్నట్టుండి ప్రసాద్‌తో షీలా మాట్లాడటం మానేసింది. అదేసమయంలో మరో యువకుడితో సన్నిహితంగా మెలగసాగింది. ఈ విషయం తెలుసుకున్న గంగా ప్రసాద్ ఆమెపై కోపం పెంచుకుని, తగిన గుణపాఠం చెప్పాలని భావించాడు. ఇందులోభాగంగా, ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేయాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో షీలా తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారని తెలుసుకున్న ప్రసాద్‌ నాటు తుపాకీతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తొలుత షీలాపై అత్యాచారానికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన ప్రసాద్ తన వద్ద తుపాకీతో షీలాపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అడ్డొచ్చిన ఆమె తమ్ముడు రాజేంద్ర (12)పై కూడా కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
షీలా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన ప్రసాద్ కోసం గాలించగా, మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించాడని... తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తుందనే కారణంగానే ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.