షీ మ్యాన్ బాగోతాలు అన్నీఇన్నీకావయా... మాటలతో ముంచేసిన మాయలేడి

woman victim
ఠాగూర్| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (10:36 IST)
ఒంగోలులో వెలుగు చూసిన మాయలేడి కథలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె కంఠం మగవాడిలా ఉండటంతో తలకు విగ్ ధరించి మగాడిలా చెలామణి అయింది. ఈ కంఠంతోనే అనేక మంది అమ్మాయిలను ట్రాప్ చేసి, తన శృంగారవాంఛను తీర్చుకుంది. ముఖ్యంగా.. సెక్స్ టాయ్స్‌తో అమ్మాయిలను చిత్రహింసలకు గురిచేసి పైశాచికానందం పొందింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, ఒంగోలు జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంకు చెందిన సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి. కొన్ని నెలల క్రితం భర్తను వదిలివేసింది. ఆ తర్వాత ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మూడు నెలల క్రితం ఒంగోలు మారుతీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడ సిమ్‌కార్డులు విక్రయించే వంశీ అనే యువకుడికి సుమలత, ఏడుకొండలుతో పరిచయం ఏర్పడింది.

సిమ్‌ కార్డుల కోసం వంశీ వద్దకు వచ్చే యువతుల ఫోన్‌ నంబర్లను సుమలతకు ఏడుకొండలు అందజేసేవాడు. సుమలత వారితో సాయితేజా రెడ్డి పేరుతో మాట్లాడి ట్రాప్‌ చేసేది. అమ్మాయిలపై సుమలతనే కాదు. ఏడుకొండలు, వంశీ కూడా అత్యాచారం చేసేవారు. పెళ్లికాని యువతులు, కాలేజీ విద్యార్థినులు, బాలికలను లక్ష్యంగా చేసుకొని సుమలత అకృత్యాలకు పాల్పడింది. సెక్స్ టాయ్స్‌తో చిత్ర హింసలు పెడుతూ తన కామవాంఛను తీర్చుకునేది. ఇంత జరిగినా బాధితులంతా అవమానభారంతో మిన్నకుండిపోయారు.

ఈ క్రమంలో ఈనెల 2న జరుగుమల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లిన సుమలత, ఏడుకొండలు అక్కడి నుంచి ఓ బాలికను ఆటోలో ఒంగోలులోని తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆ బాలికకు అక్కడ రెండు రోజులపాటు సుమలత మత్తుమందు ఇచ్చి.. సెక్స్‌ టాయ్స్‌తో అత్యాచారం చేసింది. ఆ బాధిత బాలికే ఇటీవల 'స్పందన'లో జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుతో సుమలత బాగోతం వెలుగులోకి వచ్చింది.

సుమలత కాకుండా, తనపై మరి కొంతమంది కూడా అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం సుమలత, వంశీని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుమలత ప్రియుడు ఏడుకొండలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఇంట్లో కొన్ని సెక్స్‌ టాయ్స్‌ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుంటుండగా, భయపడిన ఏడుకొండలు... భవనం చివరి అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

ఈ మాయలేడి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మగవాడిలా వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కంఠం మగవాడిలా ఉండడంతో తలకు విగ్ ధరించి మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. తాజా కేసులో ఆమె రిమాండ్‌లో ఉంది.

శుక్రవారం ఒంగోలు మారుతీనగర్‌లోని సుమలత ఇంటికి వెళ్లి సోదాలు చేసిన పోలీసులు ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. వాటిలో మూడు లేఖలు హాయ్ పేరుతో ఉండగా, మిగతా నాలుగు సాయిచరణ్ పేరుతో ఉన్నాయి. దీంతో ఆమె సాయిచరణ్ పేరుతో మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు నిర్ధారించారు.

అలాగే, ఆమె ఇంటి నుంచి మగవారు ధరించే విగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని సాయంతో ఆమె పొడవాటి జడను కప్పి ఉంచినట్టు నిర్ధారించారు. ఇక, ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ప్రేమ లేఖల్లో కింద సంతకం లేకపోవడంతో వాటిని ఎవరు రాసి ఉంటారనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితురాలు సుమలత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ‘షీ మ్యాన్’లా ఎందుకు వ్యవహరిస్తోందో తెలుసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :