మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (12:47 IST)

వాటి వాడకం తగ్గడంతో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందట..!

ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దేశంలో 19 రాష్ట్రాల్లో కండోమ్‌ల వాడకం బాగా తగ్గిపోయిందట.

2000లో సురక్షిత శృంగారం కోసం 38 శాతం మండి కండోమ్‌లు వాడుతుంటే ఇప్పుడు 2018 నాటికి అది కేవలం 24 శాతానికి పడిపోయిందట. పురుషులు భావ ప్రాప్తి కోసం కండోమ్‌లను వాడట్లేదని తాడా సర్వేలో వెల్లడి అయ్యిందని తాజా అధ్యయనం తేల్చేసింది. 
 
ఇంకా థ్రిల్ ఇవ్వని కండోమ్‌ల కంటే గర్భనిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు ఎక్కువుగా వాడుతున్నారు. భావప్రాప్తిలో పురుషులు అస్సలు రాజీ పడట్లేదని ఆ ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ పనులు సమాజానికి పెను ప్రమాదం లాంటివని తెలుస్తోంది. కండోమ్ వాడకుండా అసురక్షితమైన శృంగారం చేస్తే ఆ భాగస్వామికి ఎయిడ్స్ లేదా ఇతర లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
 
ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితం ముగిసినట్లే. ప్రస్తుతం కండోమ్స్ వాడకపోవడం ద్వారా  ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో రోజు రోజుకు ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.