నోటి దుర్వాసనకు బేకింగ్ సోడా?

సెల్వి| Last Updated: బుధవారం, 13 నవంబరు 2019 (11:54 IST)
అవును.. నోటి దుర్వాసనను పోగొట్టుకోవాలంటే.. బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి నోటిని పుక్కిలించుకుంటే తొలగిపోతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టుకోవాలంటే.. తులసీ ఆకులను నములుతూ వుండాలి.

అంతేగాకుండా నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని లేదా ఓ ఆరెంజ్ పండును తీసుకోవడం చేయాలి. అయితే నిమ్మరసం వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోతాదుకు మించి వాడకూడదు. ఇవి దంతాలకు మేలు చేయవు.

వీటితో పాటు ఏలకులను తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఓ ఏలక్కాయను నోటిలో వేసి నమిలితే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :