గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...

vande bharat express
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ నగర్ - ముంబైల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందుభాగంలో అమర్చిన డోమ్‌కు అమర్చిన  మెటల్ ప్లేట్ ఒకటి ఊడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు 
 
ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డురాగా, వాటిని గమనించిన లోకో పైలెట్ షడన్ బ్రేక్ వేశారు. అయినప్పటికీ ఓ గేదెను రైలు ఢీకొట్టింది. 
 
దీంతో రైలు ముందు భాగంలోని డోమ్‌కు ఉన్న ఒక మెటల్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంపై విపక్షాల నేతలు సెటైర్లు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఈ ప్రమాదంపై భారత రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని, ప్రమాదం జరిగిన 8 నిమిషాల్లోనే రైలు బయలుదేరి గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది.