గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (16:47 IST)

కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహమా? వరుణ్ గాంధీ ఫైర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భార‌త‌దేశానికి 2014లో స్వాతంత్ర్యం వ‌చ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం' అని కంగ‌నా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్‌లో కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
వీటిపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఘాటుగానే స్పందించారు. కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహంగా భావించాలా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల ప‌ద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగ‌నా.. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడారని గుర్తుచేశారు. 
 
భార‌త జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించ‌డం స‌రికాదన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగ‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్పుడేమో.. మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌తో పాటు ల‌క్ష‌లాది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను అగౌర‌వించ‌డం స‌రికాదు అని వరుణ్ గాంధీ హితవు పలికాలు.