మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:29 IST)

బిల్లు పే చేయమంటే.. రెస్టారెంట్ ఉద్యోగిని బాదేశారు..

Noida
Noida
నోయిడాలో మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు తమ బిల్లు చెల్లించమని అడిగినందుకు రెస్టారెంట్ ఉద్యోగిపై దాడి చేసారు. ఈ ఘటన రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి నోయిడా సెక్టార్ 29లోని కుక్ డు కు రెస్టారెంట్‌కు గౌరవ్ యాదవ్, హిమాన్షు, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లారని పోలీసు అధికారి తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు రూ.650 బిల్లు కట్టకుండా బయటికి వెళ్లారు. 
 
అయితే బిల్లు పే చేయండని హోటల్  సిబ్బందిలో ఒకరైన షహబుద్దీన్ అభ్యర్థించాడు. దీంతో ఆగ్రహించిన వ్యక్తులు షహబుద్దీన్‌ను దుర్భాషలాడడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో ఒకరు రెస్టారెంట్ ఉద్యోగిని నేలపై పడేలా బలంగా వారు తన్నడం రికార్డ్ అయ్యింది. 
 
అతను లేచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతనిని మందు తాగిన వ్యక్తులు చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించి పోలీసులకు షహబుద్దీన్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.