గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (20:28 IST)

70 ఏళ్లు పైబడిన వ్యక్తిపై లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్

Man
Man
బీహార్‌కు చెందిన ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళా పోలీసులు దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు పదేపదే లాఠీతో కొట్టినట్లు చూపిస్తుంది.  
 
వివరాల్లోకి వెళితే.. నావల్ కిషోర్ పాండే అనే వ్యక్తి కైమూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతను పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, రద్దీగా ఉండే వీధిలో అతని సైకిల్ స్కిడ్ అవడంతో అతని వెనుక ట్రాఫిక్ జామ్ అయింది. 
 
ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వద్దకు వచ్చి సైకిల్‌ను తీసివేయమని అడిగారు. అయితే, ఆ వృద్ధుడు సైకిల్‌ను తీసేందుకు కష్టపడటంతో ఆగ్రహించిన పోలీసులు అతడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు.