గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (11:09 IST)

కోవిడ్ టీకాతో మనల్ని కాపాడిన మోదీకి ఓటు వేయండి.. దేవేంద్ర ఫడ్నవీస్

covid vaccine
కోవిడ్-19 సమయంలో తమ ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓటర్లను కోరారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారానికి నాయకత్వం వహించి దేశంలో అనేక మంది ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశంసించారు.
 
"మోదీ మనకు వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్లే ఈ రోజు మనం బతికి ఉన్నాం. మా ప్రాణాలకు రక్షణ కల్పించింది మోదీయే. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ర్యాలీలో ఫడ్నవీస్ మాట్లాడుతూ... కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, వ్యాక్సిన్‌ల సకాలంలో తయారీ, సేకరణ, వాటి పంపిణీలో మోడీ కీలక పాత్ర పోషించారు" అని ఫడ్నవీస్ అన్నారు.
 
ఇంకా, వివిధ దేశాల్లోని ప్రజల ప్రాణాలను కూడా కాపాడిన ఘనత మోదీదే. మోదీ వల్లే తమ పౌరులు సజీవంగా ఉన్నారని 100కు పైగా దేశాలు గుర్తించాయని చెప్పుకొచ్చారు.