ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (15:51 IST)

గోరఖ్‌పూర్‌లో దారుణం.. ఇంటికెళ్లి.. యువతిని చితకబాదారు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్‌లో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో బకాయిలు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థ.. ఆక్సిజన్ సరఫ

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్‌లో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో బకాయిలు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థ.. ఆక్సిజన్ సరఫరా చేయడాన్ని నిలిపివేసింది. దీంతో 79 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా అదే యూపీ గోరఖ్ పూర్‌లో ఓ యువతిని దారుణంగా వేధించారు.
 
చెన్నైలో ప్రేమకు నో చెప్పిందని.. ఇంటికెళ్లి మరీ యువతికి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన మరవకముందే.. ఇదే తరహాలో ఓ యువతి ఇంటికెళ్లిన ఓ యువకుడు ఆమెను బయటికి రావాల్సిందిగా అరిచాడు. రోడ్డుపై నిలుచుని రాయితో కిటికీలను పగులకొట్టాడు. తనతో పాటు పది మంది యువకులను వెంటబట్టుకుని వచ్చాయి. చివరికి సదరు యువకుడి అరుపులకు తాళలేక బాధిత యువతి ఇంటి నుంచి బయటికొచ్చి.. యువకుడితో వాదనకు దిగింది. 
 
ఇంతలో యువకుడి స్నేహితుడు యువతి చెంప చెల్లుమనిపించాడు. ఆపై స్నేహితులందరూ ఆ యువతిని చావబాదారు. యువతిని కాపాడే క్రమంలో బయటకు వచ్చిన ఆమె తల్లిపై కూడా యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 12వ తేదీన జరిగింది. సీసీటీవీ ఫూటేజ్‌లో ఈ ఘటనకు సంబంధించినదంతా అరాచకం బయల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోనూ మీరూ చూడండి.