వివాహితపై కన్నేశారు.. లోపలికి పిలిచి కోరిక తీర్చమన్నారు.. కాదనేసరికి?
వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితునికి కూడా ఆమెను పంచాలనుకున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి ఆమె అంగీకరించకపోవడంతో.. ఆ మహిళను ఆ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతంలో ఉండే సుశీల్(40) వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో 42 ఏళ్ల మహిళపై సుశీల్, అతని స్నేహితుడు మోజు పడ్డారు. ఈ నెల 6న ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి.. తమ కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆవేశంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు.
గొంతు నులిమి చంపేశారు. ఆపై ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాచ్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. అతని స్నేహితుడు మాత్రం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.