శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 16 ఆగస్టు 2020 (11:38 IST)

ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజల కృషి, సహకారం, అంకిత భావంతో కరోనాను అణిచివేశాం: అరవింద్ కేజ్రీవాల్

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. గత 73 సంవత్సరాలుగా ఇదే రోజును మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్నాము.
 
మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో సమస్యలు ఎదురైనా ఈ సందర్భంలో మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందమని, ఇది మనందరి బాధ్యత అని కొనియాడారు. కరోనాను నియంత్రంచడంలో ఢిల్లీలో గల 2 కోట్ల ప్రజల సహాయసహకారాల వలనే ఇది సాధ్యమైందని తెలిపారు.
ప్రస్తుతం క్షీణించిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం అనేక వస్తువులపై రాయితీలు ఇస్తున్నామనీ, భవిష్యత్తులో ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందని తెలిపారు. దీనికోసం జాబ్ పోర్టల్‌ను ఏర్పరచి అనేక పరిశ్రమల సంఘాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు.
 
గత ఐదు సంవత్సరాలలో ఢిల్లీలో గల 2 కోట్ల మంది ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2015-16లో డెంగ్యూ సంక్రమించినప్పుడు వాటి బారిన దాదాపు 1,500 మంది పడితే వారిలో 60 మంది ప్రాణాలను కోల్పోయారు. డెంగ్యూను నియంత్రిచడం కోసం గట్టి చర్యలను తీసుకొని 2019లో పూర్తిగా నియంత్రించడం జరిగిందన్నారు.
 
అదేవిధంగా ప్రస్తుతం కరోనా అధికమిస్తున్ని సంధర్భంగా కఠిన చర్యలు తీసుకొని ప్రజల సహకారంతో వాటిని నియంత్రిస్తున్నాము. దేశ రాజధానిగా పేరుగాంచిన ఢిల్లీలో ఎంతోమంది ప్రజలు జీవనోపాధి కోసం స్థిరపడ్డారు. ఇలాంటి తరుణంలో ప్రజలు భద్రత కోసం అనేక సంస్థలు, కార్యలయాలు నేడు కరోనా కట్టడి కోసం సహకరిస్తున్నాయి.
 
కరోనాను నియంత్రించడంలో అనేక చర్యలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఎన్నో అధునాతన వైద్యపరికరాలు, సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నా కూడా కరోనాను అదుపుచేయలేక సతమవుతున్నాయి. అలాంటి సందర్భంలో స్వల్ప వైద్య సదుపాయాలతో మనం కరోనాను నియంత్రించడం విశేషం. ఇందుకు ప్రజల సహకారమే మూలకారణమన్నారు.
ముఖ్యంగా ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజల కృషి, సహకారం, అంకిత భావంతో మేము కరోనాను నియంత్రిచగలిగాము. డిల్లీని మోడల్‌గా మార్చడంలో పూర్తి అధ్యయనం చేశాము. ఇది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. కరోనా కట్టడి కోసం ఎంతోమంది యోధులు పోరాటం చేసి ప్రజల ప్రాణాలను కాపాడారు. వారికి నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. విదేశీ పాలన నుండి మన దేశ స్వేచ్చ కోసం ప్రాణాలను అర్పించిన సమరయోధులను స్మరించుకునే రోజు ఇది.
 
ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడం కోసం మేము డీజల్ ధరలను తగ్గించాము. అదేవిధంగా జాబ్ పోర్టల్ ఏర్పరచి, పరిశ్రమల సంఘాలతో చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకున్నాము. విద్యుత్, గ్యాస్, నీరు మొదలైన వాటికి రాయితీలు ఇచ్చాము. డిల్లీ ప్రభుత్వం భవిష్యత్తులో వీటిని కొనసాగిస్తుంది అని చెప్పారు.