శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (12:13 IST)

కరోనా సోకి మృతి చెందితే ఇంటికి చెప్పకుండా అంత్యక్రియలు చేశారు..?

కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కరోనా సోకిన వారి మృతదేహాలను మార్చి ఇచ్చేయడం వంటి ఘటనలు వినే వున్నాం. ఇంకా కొన్నిచోట్ల వైద్యులు సహా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా వుంది. కరోనాతో చావు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలా కన్నా హీనంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా సరే సిబ్బందిలో మార్పులు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
 
ఎంజీఎంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కరోనాతో చనిపోయిన మహిళను బంధువులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేశారు అధికారులు. తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెళితే లేదని చెప్పారు అధికారులు. 
 
మృతదేహాన్ని ఎక్కడా అంత్యక్రియలు చేశారో చెప్పలేదు. దీనితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళా ఈ నెల 13న ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.