భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల సంఖ్య.. 990మంది మృతి
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు.
పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కరోనా కేసులు నమోదయ్యాయి. 996 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 25,26,193కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,036కి పెరిగింది.
భారత్‌లో ఇప్పటివరకు 18,08,937 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 6,68,220 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.