జమ్మూ కశ్మీర్ సరే... ఏపీకి ప్రత్యేక హోదా సంగతేంటి?
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ నేతలను చర్చలకు పిలిచారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్రహోదాను కల్పించడంతో పాటు, అక్కడ ఎన్నికలను నిర్వహించడం అన్న రెండు అంశాల చుట్టే ఈ సమావేశం తిరుగుతుందన్న వాదన కూడా ఉంది.
అయితే ఈ వార్తలను ప్రభుత్వం వర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నాయి. కేవలం పునర్విభజన అంశాన్నే చర్చించడానికి మోదీ వారిని పిలిచినట్లు తెలుస్తోంది. పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చే సమయం ఇంకాస్త దూరంలోనే ఉందని, ఈ క్షణమే ఆ హోదా ఇవ్వడానికి కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
పునర్విభజన విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో ఉందని, ఈ ప్రక్రియ జూన్ మాసం నుంచే ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర హోదా అనే అంశం కచ్చితంగా ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది.
అయితే రాష్ట్ర హోదా ఇచ్చే ముందు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ అంశాన్ని ఈ సమావేశంలో పూర్తిగా చర్చించకపోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం.