ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (10:21 IST)

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతాం : అమిత్ షా

Amit shah
దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, అందరి మద్దతుతో కామల్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 
 
పౌర ఉమ్మడి స్మతిపై జనసంఘ్ నాటి నుంచి దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటన్నారు. సరైన సమయంలో యూసీసీ తీసుకునిరావాలన్న రాజ్యాంగ అసెంబ్లీ కూడా పార్లమెంట్‌కు సూచంచిందని గుర్తుచేశారు. దేశంలో లౌకిక ప్రాతిపదికన చట్టాలు ఉండరాదు. అందరికీ ఒకే చట్టం వర్తించాలి అని అన్నారు. 
 
'రాజ్యాంగ సభ కూడా సరైన సమయం వచ్చినపుడు యూసీసీని అమలు చేయాలని సూచించింది. ఏ లౌకిక దేశమైన మతం ఆధారంగా చట్టాలు చేయలేదు. దేశం, దాని రాష్ట్రాలు సెక్యులర్ అయినప్పుడు మతం ఆధారంగా చట్టాలు ఎలా ఉంటాయి, పార్లమెంట్ ఆమోదించిన ఒకే చట్టం ఉండాలి అని ఆయన అన్నారు. 
 
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఈ సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉంటే కోర్టులకు వెళ్లవచ్చన్నారు. అదేసమయంలో దేశ చరిత్రను వక్రీకరించారని, దాన్ని సరి చేసేందుకు చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులు సూచించారని తెలిపారు.