శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (15:17 IST)

కార్పొరేట్ ఉద్యోగం కంటే క్యాబ్‌ డ్రైవర్‌గానే ఎక్కువ ఆదాయం : ట్యాక్సీ డ్రైవర్ వెల్లడి

bus driver
కార్పొరేట్ ఉద్యోగం వస్తే ఆదాయం కంటే.. క్యాబ్ డ్రైవరుగానే అధిక ఆదాయం సంపాదిస్తున్నట్టు క్వాల్‌కామ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు. ఈయన క్వాల్ కామ్ కార్పోరేట్ కంపెనీ ఉద్యోగానికి రాజీనామా చేసి ట్యాక్సీ డ్రైవరుగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని అతని ట్యాక్సీలో ప్రయాణించిన ఓ మహిళ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై శ్వేతా కుక్రేజా అనే మహిళ ఓ ట్వీట్ చేశారు. 
 
"నిన్న నేను ఓ క్యాబ్‌లో ప్రయాణించాను. క్యాబ్ డ్రైవర్ ఓ ఇంజనీర్. అతడు క్వాల్‌కామ్ కంపెనీలో తన కార్పొరేట్ ఉద్యోగం కంటే క్యాబ్ నడపడం ద్వారానే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్టు చెప్పాడు" అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. చివర్లో ఆనంద భాష్పాలు రాలుసున్న ఎమోజీని జతచేశారు. ఇపుడు ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన తర్వాత పలువురు నెటిజన్లు ఇలా అవాక్కయ్యే పలు సంఘటనలను కూడా పంచుకున్నారు. 
 
సినీ నటి జయప్రదకు ఆర్నెల్ల జైలు : చెన్నై కోర్టు తీర్పు 
 
సినీ నటి జయప్రదకు షాక్ తగిలింది. ఈఎస్ఐ స్కామ్‌లో ఆమెకు ఆర్నెల్ల జైలు శిక్షి విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చెన్నై ఎగ్మోర్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, చెన్నై రాయపేటలో జయప్రదకు జయప్రద, రాజ్ అనే పేర్లతో రెండు థియేటర్లు ఉండేవి. వీటిని ఆమె సోదరులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఈ థియేటర్లలో పని చేసిన కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ సొమ్మును సంబంధింత ఖాతాలో యాజమాన్యం జమ చేయలేదు. 
 
అంటే కార్మికుల ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికకులు, అటు కార్పొరేషన్ స్థానిక ఎగ్మోర్ కోర్టుకు ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సమయంలో కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో మూడు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. 
 
అయితే, ఎగ్మోర్ కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కేసును కొనసాగించింది. సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. జయప్రదతో పాటు ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం చొప్పున విధిస్తూ తీర్పునిచ్చింది.