శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (22:31 IST)

యువతులతో పార్ట్‌నర్షిప్ యోగా..! చెన్నైలో సెంటర్, చైనాలో ఆఫీస్.. 1000 మందిని?

యువతులతో పార్టనర్‌షిప్ యోగా సెంటర్‌ను చెన్నైలో నడిపాడు. చైనాలోనూ ఆఫీసు పెట్టాడు. అయితే 1000 మంది యువతుల జీవితాలను నాశనం చేసిన యోగా మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన నకిలీ యోగా మాస్టర్‌ వ్యవహారం షాకిచ్చింది. తమిళనాడు పట్టుక్కోట్టైకి చెందిన యోగారాజ్ అనే వ్యక్తి చెన్నై కోడంబాక్కం ప్రాంతంలో నివసించేవాడు. 
 
అలాగే అతడు టీనగర్లో యోగా సెంటర్‌ను నడిపాడు. ఈ నేపథ్యంలో యోగా సెంటర్లో యువతులను లైంగికంగా వేధించినట్లు.. ఆపై వీడియోలు కూడా తీసినట్లు తెలిసింది. ఈ వీడియోల ఆధారంగా యువతులను బెదిరించడం చేశాడు. ఓ బాధితురాలి  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. యోగా మాస్టర్‌గా.. నకిలీ బాబు వేషంలో గత 2021 నుంచి దాదాపు వేలాది మంది యువతులను జీవితాన్ని నాశనం చేశాడు.
 
యోగా సెంటర్‌కు వచ్చే యువతులను లొంగదీసుకుని.. వారికి తెలియకుండానే వీడియో తీసి.. వారిని బెదిరించి లైంగికంగా దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యోగరాజ్ కోయంబత్తూరు, తిరుప్పూర్, ముంబై పోలీసులకు రూ.10లక్షలను లంచంగా ఇచ్చినట్లు వెల్లడి అయ్యింది. ఇక్కడితో ఆగకుండా యోగరాజ్ చైనాకు చెందిన ఓ యువతిని వివాహం కూడా చేసుకున్నాడట. 
 
అయితే భార్యను కూడా వీడియో తీసిన యోగరాజ్‌ నుంచి ఆమె దూరంగా వుంటుంది. ఇంకా విడాకులు కూడా తీసుకుంది. దీంతో యోగరాజ్ గత 6 నెలల పాటు ఎవరెవరితో మాట్లాడాడు అనే వివరాలను పోలీసులు సేకరించారు. వీటిని కోర్టులో సమర్పించేందుకు సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.