శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (17:43 IST)

మమతానా మజాకా... కారు దిగిరాగానే పరుగో పరుగు

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే గల్లీ లీడర్లే కాదు.. బడా నేతలకు హడల్. ఆమె ముక్కుసూటి మనిషి. పేదల ముఖ్యమంత్రి. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. అలాంటి ఆమెకు శనివారం సాయంత్రం ఊహించని అనుభవం ఒకటి ఎదురైంది 
 
పశ్చి మిడ్నాపూర్‌లో కొందరు ఆమెను చూసి 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం మమత ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
కొంతమంది గ్రామస్తులు తమ చేతిలో బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని చూడగానే 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. 
 
అంతే.. బీజేపీ కార్యకర్తలు ఆమెను చూసి పరుగు లంకించుకున్నారు. దీంతో మమత వారిని చూసి 'ఎందుకు పారిపోతున్నారు. ఇలా రండి...' అని పిలిచారు. వాళ్లంతా చాలా తెలివిగా తప్పించుకుంటున్నారంటూ పేర్కొన్న మమత అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి బయల్దేరి వెళ్లారు.