సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:36 IST)

రుణాలు ఎగవేసిన వారి జాబితా వెల్లడించాల్సిందే : బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్

బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా తిరుగుతున్న రుణ ఎగవేతదారుల జాబితాను బహిర్గతం చేయాల్సిందేనంటూ భారత రిజర్వు బ్యాంకుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
 
ఆర్టీఐ కార్య‌క‌ర్త అగ‌ర్వాల్ వేసిన పిటిష‌న్‌ను స్వీక‌రించిన సుప్రీం ఈ వ్యాఖ్య‌లు చేసింది. వార్షిక త‌నిఖీ నివేదిక‌ను బ్యాంకులు విడుద‌ల చేయాల‌ని జ‌న‌వ‌రి నెల‌లో నోటీసులు కూడా సుప్రీంకోర్టు జారీచేసింది. 
 
జ‌స్టిస్ ఎల్.నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీఐ చ‌ట్టం ప్ర‌కారం వివ‌రాల‌ను తెలుపాల‌ని కోర్టు కోరింది. ఒక‌వేళ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తే.. త‌ర్వాత ధిక్క‌ర‌ణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.