Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వంకాయ చికెన్ కీమా... ఎలా చేయాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:16 IST)
నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ని అమితంగా ఇష్టపడతారు. అయితే చికెన్‌ని రొటీన్‌గా కాకుండా వెరైటీగా వండితే చాలా ఇష్టంగా తింటారు. వంకాయతో చికెన్.. ఏంటీ అనుకుంటున్నారా.... దీని రుచి చాలా బాగుంటుంది. వంకాయలో చికెన్ కీమా స్టఫ్ చేసి వండుకుని తింటే ఆ రుచే వేరు. మరి వంకాయతో చికెన్ కీమా ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావాల్సిన పదార్థాలు
వంకాయలు - ఆరు,
చికెన్ కీమా - అర కిలో,
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,
పచ్చిమిర్చి- మూడు(తరిగినవి),
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను,
టమోటాలు - రెండు,
చక్కెర - ఒక టీస్పూను, 
మిరియాల పొడి - పావు టీస్పూను,
ఉప్పు - తగినంత,
నూనె - సరిపడినంత, 
గరం మసాలా - ఒక టీస్పూను,
కారం - ఒక టీస్పూను
 
తయారుచేయు విధానం
వంకాయల్ని కాడ తీయకుండా... నిలువుగా మధ్యలోకి కోయాలి. స్పూన్‌తో లోపలి గుజ్జును తీసేయాలి. లోపల కాస్త ఉప్పు చల్లితే నీరు పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి వేసి అవి వేగాక అల్లంవెల్లుల్లి వేసి రెండు నిముషాలు వెయించాలి. తరువాత చికెన్ కీమా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో టమోటా ప్యూరీని వేసి వేయించాలి. తరువాత మిరియాల పొడి, కాస్త చక్కెర, ఉప్పు వేసి కలపి మూతపెట్టి బాగా ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయచ్చు. నీరంతా చిక్కబడే దాకా కీమాని వేయించాలి. 
 
ఇప్పుడు వంకాయ డొప్పల్లో కాస్త నూనె రాసి కీమాని స్టఫ్ చేయాలి. అలా చేసిన వాటిని ఓవెన్‌లో 20 నిమిషాల పాటూ ఉంచాలి. అంతే... చికెన్ స్టఫ్డ్ వంకాయలు రుచిరుచిగా రెడీ అయినట్టే.

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?

Vijay’s AP Visit: చంద్రబాబు- పవన్‌లతో భేటీ కానున్న తమిళనాడు సీఎం విజయ్

Rahul Gandhi, కార్యకర్తకి మోచేతితో రాహుల్ కుమ్మాయి పోటు, వీడియో వైరల్

జంతర్ మంతర్ ఇక నిరసనలకు కేటాయించిన ప్రదేశం కాదు.. డీ-నోటిఫై

వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు... కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా హీరో కుమార్తె

నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

తర్వాతి కథనం
Show comments