పచ్చిబఠాణీలతో స్నాక్స్..?

Last Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:28 IST)
కావలసిన పదార్థాలు:
పచ్చిబఠాణీలు - 2 కప్పులు
మిరియాల పొడి - అరస్పూన్
జీలకర్రపొడి - అరస్పూన్
వెల్లుల్లి ముక్కలు - స్పూన్
ధనియాల పొడి - కొద్దిగా
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
ముందుగా ఓవెన్‌లో పెట్టే పాత్రకు అడుగుభాగంలో నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఆపై కడిగిన పచ్చిబఠాణీలను తడిలేకుండా తుడిచి ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెల్లోనే మిరియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి తరుగు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఓవెన్ పాత్రలో వేయాలి. ఆ పాత్రని ఓవెన్లో పెట్టి 40 నిమిషాలు బేక్ చేయాలి. మధ్య మధ్యలో బయటకు తీసి కలుపుతూ ఉండాలి. ఆపై తీసి చల్లారాక ఒక డబ్బాలో వేసుకుంటే మూడురోజుల వరకు నిల్వ ఉంటాయి.దీనిపై మరింత చదవండి :