సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (22:23 IST)

పిల్లలు ఇష్టపడే చికెన్ పాప్ కార్న్ ఎలా చేయాలంటే..

Pop Corn Chicken Recipe
Pop Corn Chicken Recipe
కావలసిన పదార్థాలు : 
 
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా
వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్ 
బ్రెడ్ - నాలుగు 
పాలు - 1 టేబుల్ స్పూన్
మైదా - 1/2 కప్పు.
 
తయారీ విధానం.. ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో బాగా కడగాలి. తర్వాత కడిగిన చికెన్‌ను ఒక గిన్నెలో వేసి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు వేసి 20 నిమిషాలు నాననివ్వాలి. 
 
తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు టోస్ట్ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పొడితో జీలకర్ర పొడి, గరం మసాలా కలపాలి. తర్వాత గుడ్డును ఒక గిన్నెలోకి పగలగొట్టి అందులో పాలు వేసి గిల కొట్టాలి. తర్వాత ప్లేటులో మైదా వేయాలి. 
 
ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత చికెన్ ముక్కను తీసుకుని ముందుగా గుడ్డు మిశ్రమంలో వేసి మైదాలో వేయించి మళ్లీ గుడ్డులో వేసి చివరగా బ్రెడ్ పౌడర్‌లో వేసి నూనెలో వేయాలి. చికెన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటే క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ రెడీ.