శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2017 (21:32 IST)

అమెరికాలో పేషెంట్ చేతిలో హత్యకు గురైన ఎన్నారై వైద్యుడు అచ్యుత్ రెడ్డి

అమెరికాలో గత 28 ఏళ్లుగా సైక్రియాట్రిస్టుగా పనిచేస్తున్న అచ్యుత్ రెడ్డి తను చికిత్స చేస్తున్న రోగి చేతిలోనే హత్యకు గురయ్యాడు. చికిత్స చేస్తున్న సమయంలో రోగి అకస్మాత్తుగా కత్తి తీసుకుని అచ్యుత్ రెడ్డిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దానితో ఆయన అక్కడ

అమెరికాలో గత 28 ఏళ్లుగా సైక్రియాట్రిస్టుగా పనిచేస్తున్న అచ్యుత్ రెడ్డి తను చికిత్స చేస్తున్న రోగి చేతిలోనే హత్యకు గురయ్యాడు. చికిత్స చేస్తున్న సమయంలో రోగి అకస్మాత్తుగా కత్తి తీసుకుని అచ్యుత్ రెడ్డిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దానితో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.
 
సైక్రియాట్రిస్టుగా పనిచేస్తున్న అచ్యుత్ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ. 57 ఏళ్ల అచ్యుత్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య వున్నారు. ఆయన అమెరికాలోనే వుంటున్నప్పటికీ స్వస్థలం మిర్యాలగూడంటే ఎంతో ఇష్టం. ఇక్కడే ఇల్లు కూడా నిర్మించుకున్నారు.