శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 జులై 2018 (18:21 IST)

లండన్‌లో కాంగ్రెస్ సమావేశం... ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఏమన్నారంటే?

తెలంగాణ ఎన్నారైల ఆహ్వానం మేరకు లండన్ బోనాలకు విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుం

తెలంగాణ ఎన్నారైల ఆహ్వానం మేరకు లండన్ బోనాలకు విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ  సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని అతి త్వరలోనే విముక్తి కలుగుతుందని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తధ్యమని అన్నారు. 70% ఓట్లతో రాష్ట్రములో 90 సీట్లు గెలుచుకునేలా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఈవీఎం యంత్రాల పనితీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని, అభివృద్ధి, టెక్నాలజీలో ముందున్న దేశాల్లో పేపర్ బ్యాలట్ నిర్వహిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సందేహాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ బ్యాలెట్ నిర్వహించేలా ఎన్నారైలు కూడా చొరవ చూపాలని కోరారు. 
 
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే యూరోప్ అధ్యక్షుడు కమల్ మాట్లాడుతూ... బీజేపీ పాలనలో దేశం 100 ఏండ్లు వెళ్లిందని, సంపన్నులు సంపాదనలో 100 ఏండ్లు ముందుకు వెళ్లారని, ప్రధాని మోడీ సంపన్నులకు సేల్స్‌మాన్‌గా పని చేస్తున్నారని, దళితులపై దాడులు అరికట్టడంలో విఫలం అయ్యారని అన్నారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను నిర్లక్యం చేస్తుందని ఎన్నారై మంత్రి కేటీర్ ఎన్నారై పాలసీ అమల్లోకి తీసుకువచ్చే శ్రద్ద చూపడం లేదని అన్నారు. గల్ఫ్‌కు వలస వెళ్లిన   లక్షలాది రైతులు రైతు బంధు పథకం నిబంధనలతో నష్టపోయారని అన్నారు. నాలుగేండ్లు నిద్రపోయి 100 కోట్లు ఎన్నారై సంక్షేమం ప్రకటనకే పరిమితం అయిందని అన్నారు. 
 
టీపీసీసీ కో-కన్వీనర్ సుధాకర్ రంగుల మాట్లాడుతూ... 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యువత ఉపాధి, ప్రభుత్వ నియామకాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గురమిందర్ సింగ్, అస్రా అంజుమ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్, బాలకృష్ణా రెడ్డి, అచ్యుత రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధులు పాల్గొన్నారు.