Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

Written By సెల్వి
Updated: శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:25 IST)
మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృ దేవతలకు తర్పణం ఇస్తే ముక్తిని పొందుతారు. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజుగా పరిగణించబడుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో రెండవ నక్షత్రంగా భరణిని పరిగణించబడుతుంది. 
 
ఈ భరణి నక్షత్రానికి శుభఫలితాలను ఇస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం మంచిది. చతుర్థశి రోజున వచ్చే ఈ భరణి నక్షత్రం నాడు యమదీపం వేయడం ద్వారా నరకం అనుభవించే పితరులను స్వర్గానికి పంపుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. 
ఈ దీపాన్ని భరణి నక్షత్రం వున్న రోజు బ్రహ్మముహూర్తం లేదా.. సాయంత్రం పూట ఇంటికి వెలుపల వెలిగించాలి. ఈ దీపం దక్షిణ ముఖాన వుండాలి. దీప జ్యోతి దక్షిణం వైపు చూసేలా వుండాలి. అలా ఇంట్లో వెలిగించడం కుదరకపోతే.. ఈ యమ దీపాన్ని శనీశ్వరుడి ముందు వెలిగించాలి. 
 
ఈ రోజున అన్నదానం చేయడం.. నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కాస్త కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments