Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-05-2020 సోమవారం మీ దినఫలాలు - మల్లిఖార్జున స్వామికి పూజ చేస్తే..

Written By రామన్
Updated: ఆదివారం, 3 మే 2020 (22:19 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులు ఇతరుల కారణంగా పైఅధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. 
 
వృషభం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటు సంస్థలలోని వారికి పనివారితో చిక్కులు తప్పవు. 
 
మిథునం : ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన విరమించుకోవడం శ్రేయస్కరం. గొర్రెలు, మత్స్య, పాడి పరిశ్రమల రంగాలలో వారికి సత్‌కాలం. ఖర్చులు అధికం కావడం వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. పత్రికా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. బిల్లులు చెల్లిస్తారు. అపరాలు, కిరాణా, ఫ్యాన్సీ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. స్త్రీలు అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం : రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి, కార్పెంటర్లకు, చేతి పనివారికి కలిసివచ్చే కాలం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వ్యాపారస్తులకు తోటివారు, అధికారుల కారణంగా ఆందోళన తప్పదు. 
 
కన్య : కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. సినిమా, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ పనివారలకు కలిసివచ్చే కాలం. బంధువుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం చోటుచేసుకుంటుంది. 
 
తుల : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహ నిర్మాణం, ఫర్నీచర్, అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఖర్చులు అధికం. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. 
 
ధనస్సు : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, మెకానికల్ రంగాలలో వారికి అభివృద్ధి కానరాగలదు. స్త్రీలతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వ్యాపారాభివృద్ధికే చేయు కృషిలో బాగా రాణిస్తారు. 
 
మకరం : గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్థిస్తారు. 
 
కుంభం : దంపతుల మధ్య పరస్పర అవగాహన లోపం. చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మీనం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభాపం ఇబ్బందులకు దారితీస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

02-09-2026 బుధవారం రాశి ఫలితాలు... సమయపాలన అవసరం

తర్వాతి కథనం
Show comments