శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:58 IST)

04-09-2019- బుధవారం దినఫలాలు... తొందరపాటు నిర్ణయాలతో

మేషం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విద్యార్థుల విదేశీ చదువుల యత్నం ఫలిస్తుంది. అధికారులతో మితంగా సంభాషించండి. లైసెన్సులు, పర్మిట్‌ల జాప్యం వద్దు. ఉద్యోగస్తులకు అడ్వాన్స్‌లు, క్లయింలు మంజూరవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు అనుకూలించవు.
 
వృషభం: వృత్తి ఉపాధి పథకాల్లో ఆటంకాలు, చికాకులు అధికం. క్రీడా, కళా, సాంస్కృతిక రాంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. నూతన వెంచర్లు అంతగా అనుకూలించవు. బ్యాకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది.
 
మిధునం: కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు పనిభారం అధికం. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. ఒక కార్యార్ధిమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
కర్కాటకం: వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. వీసా, పాస్‌పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. షేర్ల క్రయవిక్రయాలు ఆశించింనంత లాభాలనీయవు.
 
సింహం: గృహ నిర్మాణ ప్లానుకు ఆమెదం, రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థునులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మతపరమైన విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించవలదు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలమైనకాలం.
 
తుల: ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారస్తులకు సామాన్యం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య అవగాహన కుదరదు. మీ ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి.
 
వృశ్చికం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళుకువ అవసరం. సోదురులతో ఏకీభవించలేకపోతారు. ముఖ్యలలో ఒకరి గురించి ఆందోళన అధికమవుతుంది.
 
ధనస్సు: చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. విరివిగా ధనం వ్యయం చేయటం వల్ల బంధుమిత్రులలో అపోహలు, పలు అనుమానాలు తలెత్తగలవు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల పనితీరుకు ఇదిపరీక్షా సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
మకరం: ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. బంధువులలో గుర్తింపు ఉండజాలదు. ఎల్. ఐ. సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు.
 
కుంభం: స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం వల్ల జయం చేకూరుతుంది. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి ఉండగలవు. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం: క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారులకు సంతృప్తి కానరాదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రావటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ధన వ్యయం, విరాళిలిచ్చే విషయంలో మెళకువ వహించండి.