గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (14:06 IST)

31-08-2019- శనివారం మీ రాశి ఫలితాలు..

మేషం: విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల ఓ కంట కనిపెట్టడం మంచిది. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి.
 
వృషభం: ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. ధనం ఎంత సంపాదించినా నిలబెట్టలేకపోతారు. స్త్రీలకు పనివారలతో ఊహించని చికాకులెదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, నగదు అవార్డు వంటి ప్రోత్సాహకాలుంటాయి. 
 
మిధునం: బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు కొంత రుణం తీసుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. వైద్యరంగాల్లోని వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్ధిక సంతృప్తి ఉండదు. శత్రువులు మిత్రులుగా మారతారు. 
 
కర్కాటకం: ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. కొబ్బరి, పండ్ల, వాహనం నడుపునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. 
 
సింహం: ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుట వలన జయం చేకూరుతుంది. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లింపులు జరగవు. 
 
కన్య: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులు తొందరపాటు నిర్ణయాల వల్ల సదవకాశాలు జారవిడుచుకోవచ్చు.
 
తుల: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ముఖ్యల రాకతో మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. రాతకోతల విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచూసుకోండి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్థిరచరాస్తుల కొలుగోలు యత్నాలు ఫలిస్తాయి. 
 
వృశ్చికం: రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వచేయలేరు. మీ జీవిత భాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయాన్ని పొందుతారు. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఇబ్బందులు తప్పవు. 
 
ధనస్సు: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు సీనియర్ల నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
మకరం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత అవసరం. మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వప్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. స్త్రీలకు ఇంటి పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన మేలు పొందుతారు. దైవ, సేవ, పుణ్య కార్యాలకు ఇతోధికంగా ధనసహాయం అందిస్తారు.
 
కుంభం: ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. మీ కళత్ర మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో మీకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలమవుతాయి.
 
మీనం: ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకభిమానం కలుగుతుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పోస్టల్, ఎల్. ఐ. సి, ఏజెంట్లకు పురోభివృద్ధి కానవస్తుంది. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సాహన ప్రయత్నాలు విరమించండి.