Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం (07-06-18) దినఫలాలు - భవిష్యత్ గురించి తగుశ్రద్ధ...

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు అన

Written By raman
Updated: గురువారం, 7 జూన్ 2018 (08:50 IST)
మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు అనుకూలిస్తాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు.
 
వృషభం: తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి.
 
మిధునం: భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. ప్రైవేట్ సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. మెుక్కుబడులు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం: మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగుశ్రద్ధ తీసుకుంటారు. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. 
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలించవు. బంధువులరాకతో స్త్రీలలో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. 
 
కన్య: ఉద్యోగ, విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. పండ్ల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణాలు, బ్యాంక్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఆధ్యాత్మిక, దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల: ఆర్థికలావాదేవీలు, ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో మెలగవలసి ఉంటుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. సంతానంకోసం బాగా వ్యయంచేస్తారు. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు. 
 
వృశ్చికం: ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసివస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు.
 
ధనస్సు: ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాలవారికి చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాభివృద్ధికై నూతన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి.
 
మకరం: ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. మీ మాటే నెగ్గాలన్న పట్టుదల మంచిదికాదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. 
 
కుంభం: విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి. రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
మీనం: ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments