గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (07:41 IST)

శుక్రవారం దినఫలాలు - దానధర్మాలు చేయుట వల్ల...

మేషం: మీ లక్ష్యం నెరవేరే సమయం సమీపిస్తోంది. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు ని

మేషం: మీ లక్ష్యం నెరవేరే సమయం సమీపిస్తోంది. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
వృషభం: విద్యార్థుల ఆలోచనలు కార్యరూరం దాల్చుతాయి. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. దూరప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది.
 
మిధునం: అపరాలు, ధాన్యం, వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ రాక బంధుమిత్రులకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ధనం చేతిలో నిలబడటం కష్టమే.
 
కర్కాటకం: ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేనివారితో జాగ్రత్త అవసరం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
సింహం: స్త్రీలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటుచేసుకుంటాయి. బృందా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులకు సరిపడ ధనం సమకూరుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కన్య: ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలోసోదరులతో విభేదిస్తారు. దైవదర్శనాలు, మెుక్కుబడులు అనుకూలిస్తాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రత్తి, పొగాకు రంగాలల్ వారికి అనుకూలమైన రోజు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం.
 
తుల: ప్రైవేటు విద్యసంస్థల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధచూపిస్తారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. స్త్రీల తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
వృశ్చికం: మీ ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి సమస్యలెదుర్కుంటారు. రుణవిముక్తులు కావటంతోపాటు తాకట్లు విడిపించుకుంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
ధనస్సు: స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మధ్యవర్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు. మీ సంతానం పై చదువుల విషయంలో వారిఇష్టానికనుగుణంగా వ్యవహరించండి. కళా, ఫోటోగ్రాఫి ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాలవారికి సమయం అనుకూలం.
 
మకరం: ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి వ్యవహరిస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం: ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సముచిత హోదా, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభఫలితాలున్నాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు అధికశ్రమ దూరదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం: అద్దె ఇంటికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడుటవలన చికాకులు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి.