బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (09:07 IST)

సోమవారం (04-06-18) ... అనవసరపు విషయాల్లో తలదూర్చి...

మేషం: అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. అనవసరపు విషయాలలో తలదూర్

మేషం: అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. 
 
వృషభం: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటె సొంత నిర్ణయాలేమేలు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రయాణాల్లో మెళకువ వహించండి. క్యాటరింగ్, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
మిధునం: ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పదు. బంధుమిత్రులతో మంచిగుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
కర్కాటకం: ఎల్.ఐ.సి పోస్టల్ ఏజెంట్లకు శ్రమాధిక్యత అధికం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరంకాదని గమనించండి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వైద్యులకు పేరు, ఖ్యాతి లభిస్తాయి. ఓ చక్కని వ్యక్తి సాహచర్యం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం: ప్రముఖులకోసం వేచివుండక తప్పదు. భాగస్వామ్యుల మధ్య అవరోదాలు తలెత్తని నెమ్మదిగా పరిష్కరిస్తారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది. ఆప్తులకోసం ధనం విపరీతంగా వ్యయంచేస్తారు. 
 
కన్య: ఆర్థిక విషయాలలో ఒక అడుగుముందకు వేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. మీ సంతానం మెుండివైఖరి మీక ఎంతో చికాకు కలిగిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయ రంగాలవారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
తుల: రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బ్యాంకింగ్ రంగాలవారికి పనిభారం, చికాకులను ఎదుర్కుంటారు. మిత్రులకోసం ధనంబాగా ఖర్చుచేస్తారు. చిన్ననాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం: పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఉద్యోగం చేయు స్త్రీలకు దూరప్రాంతాలకు బదిలీలు అవుతాయి. సినిమా, కళారంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
ధనస్సు: శాస్త్ర సాంకేతిక రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాల వస్తువులకొనుగోలుకై షాపింగ్ చేస్తారు. స్త్రీల వాక్‌చాతుర్యమునకు మంచి గుర్తింపు లభిస్తుంది. అసలైన శక్తి సామర్థ్యన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. కోళ్ళ, గొఱ్ఱె, మత్స్య వ్యాపారస్తులకు ఆందోళన, చికాకులు తప్పువు. 
 
మకరం: వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. శ్రమపడ్డా ఫలితం దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ మనోభావాలు నెరవేరే సమయం ఆసన్నమయింది. 
 
కుంభం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాలవారు అచ్చుతప్పు పడుట వలన మాటపడవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.
 
మీనం: ఎవరికైన ధనసహాయం చేసినా ధనం తిరిగి రాజాలదు. ఉద్యోగస్తులకు అధికారులతో సామన్వయం లోపిస్తుంది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు.