Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-02-2019 - శనివారం మీ రాశి ఫలితాలు.. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ధి పొందుతారు..

Written By రామన్
Updated: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:09 IST)
మేషం: రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకు లెదురవుతాయి. శస్త్రచికిత్సల సంబంధంగా వైద్యరంగాల వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వ్యాపారాల్లో చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం: మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. వాతావరణంలో మార్పుతో స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పురుస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మిధునం: రవాణా విషయంలో ఆచితూచి వ్యవహరించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ధి పొందుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రతముఖ్యం. విద్యార్థులు తమ లక్ష్యసాధన పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు.  
 
కర్కాటకం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పనులు ఎంతకీ పూర్తి కాక విసుగు కలిగిస్తాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు.  
 
సింహం: వృత్తిపరంగా పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పాత రుణాలు తీరుస్తారు. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను సునాయసంగా పరిష్కరిస్తారు. అక్కౌంట్క్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి.  
 
కన్య: బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు పునరావృతమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. కోర్టు వ్యవహారాలు, ఒక కొలిక్కి రాగలవు. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.   
 
తుల: వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యాల ప్రభావం అధికం. ఉద్యోగస్తుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవ్వడం వలన ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి మొండివైఖరి అసహానం కలిగిస్తుంది. మీ అభిప్రాయాలు వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. 
 
వృశ్చికం: వ్యాపారులకు ఒడిదుడుకులు, అధికారుల తనీఖీలు అధికమవుతుంది. నేడు అనుకూలించని అవకాశం రేపు కలిసిరాగలదు. సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలవారికి ఆందోళన అధికం. అవసరాలకు కావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. 
 
ధనస్సు: ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. బంధుమిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తులకు స్థానచలనం, బాధ్యతల మార్పు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదం చేస్తాయి.  
 
మకరం: స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. కరెన్సీ నోట్ల పరిశీలన, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. మీ పనితీరు, విధేయతలు అధికారులను ఆకట్టుకుంటాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్‌ను అధిగమిస్తారు. వాహన చోదకులకు మరమ్మత్తులు, జరిమానాలు తప్పవు.     
 
కుంభం: స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఊహించిన సంఘటనలు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సత్ఫలితాలు లభిస్తాయి. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం.   
 
మీనం: మీ ఆధిపత్యం అన్నిచోట్ల పనిచేయదని గమనించండి. ఆస్తి పంపకాల్లో దాయాదులతో విభేదిస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments