08-02-2019 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన లేఖలు..

astro 8
రామన్| Last Updated: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (09:44 IST)
మేషం: ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. అయిన వారితోనైనా వ్యవహారంలో కచ్చితంగాగ ఉండాలి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు.

వృషభం: ఉద్యోగస్తులు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ యత్నాల్లో నిర్లక్ష్యం, పనులు వాయిదా కూడదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.

మిధునం: ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెంపొందించుకుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. నూతన రుణాలకోసం అన్వేషిస్తారు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

కర్కాటకం: స్త్రీల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

సింహం: ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. చిన్న తప్పిదాలనే సమస్యగా మారే ఆస్కారం ఉంది.

కన్య: ఆర్థిక విషయంలో చురుకుదనం కానవచ్చును. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి.


తుల: కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి, నిరుద్యోగులకు కలిసివచ్చేకాలం. పాతమిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

వృశ్చికం: కొంతమంది మీ దృష్టి మళ్ళించి మోసగించే ఆస్కారం ఉంది. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన లేఖలు అందుతాయి. రావలసిన ధనం వాయిదా పడుట వలన ఆందోళన చెందుతారు. బంధువుల రాక వలన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి.

ధనస్సు: స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. ఫైనాన్స్, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం.

మకరం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. సోదరీసోదరులతో విభేదాలు తలెత్తగలవు.


కుంభం: బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదర్శభావాలు గల వ్యక్తితో ఆత్మీయబంధం బలపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం.


మీనం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.దీనిపై మరింత చదవండి :