శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (09:39 IST)

04-02-2019 - సోమవారం మీ రాశి ఫలితాలు - ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి...

మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరీసోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ప్రింటింగ్ రంగాల వారికి వచ్చిన అవకాశాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. తలపెట్టిన పనులు ఆలస్యమైనా పూర్తిచేస్తారు. దుబారా ఖర్చులు అధికం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
మిధునం: ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. స్త్రీలకు పనివారితో ఊహించని చికాకులు తలెత్తుతాయి. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.  
 
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల కలయికతో మనసు కుదుటపడుతుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.  
 
సింహం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంవత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమని గమనించండి. 
 
కన్య: స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వలన సమస్యలు ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువుల రాక వలన ఖర్చులు అధికమవుతాయి.   
 
తుల: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. షేర్‌మార్కెట్ రంగాల వారికి మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
వృశ్చికం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండడం అన్ని విధాలా క్షేమ దాయకంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
ధనస్సు: ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరంచేస్తారు. విద్యార్థినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడుతాయి. ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
మకరం: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు. ఏ విషయంలోను ఇతరులను అతిగా విశ్వంచడం మంచిది కాదని గమనించండి.    
 
కుంభం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడుతాయి. రుణం తీర్చటానికై చేయు యత్నం వాయిదా పడుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల వాహనం నడపడం వలన అనుకోని ఇబ్బందులెదుర్కోవలసివస్తుంది.   
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు.