గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (09:09 IST)

11-10-2018 గురువారం దినఫలాలు - వృత్తుల వారు చెక్కులు చెల్లక...

మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. నూతన ప్రయోగాలు, సాహస కృత్యాలు, హామీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.

మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. నూతన ప్రయోగాలు, సాహస కృత్యాలు, హామీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు ఆకస్మిక విందు భోజనం, వస్తులాభం వంటి శుభఫలితాలున్నాయి. వ్యాపార, వృత్తుల వారు చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు.
 
వృషభం: మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి తోటివారితో విభేదాలు తప్పవు. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. భాగస్వాములకు మీ సమర్థత, నిజాయితీలపై నమ్మకమేర్పడుతుంది.     
 
మిధునం: మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులు మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు. మీ వల్ల సాధ్యం కాని పనులు మీ సంతానం ద్వారా సానుకూలమవుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సామూహిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల ఆహ్వానం మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
సింహం: చేపట్టిన పనులందు ఆసక్తి లేకున్నా మెుండిగా శ్రమించి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరొగ విధంగా పూడ్చుకుంటారు. భాగస్వామికులను అతిగా విశ్వసించడం మంచిది కాదు. బంధువులకు వివాహ, ఉద్యోగ సమాచారం అందిస్తారు. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు.  
 
కన్య: వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, అవకాశాలు కలిసివస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి చికాకులు తప్పవు.   
 
తుల: ఉద్యోగస్తులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రేషన్ డిలర్లకు అధికారుల నుండి ఇబ్బందులెదురవుతాయి. బంధువుల నుండి విమర్శలు, ఆక్షేపణలు, ఎదురవుతాయి. ఎలక్ట్రానిక్ మీడియా రంగాలవారికి చికాకులు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.    
 
వృశ్చికం: వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వలన అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా పడడం మంచిదని గమనించండి.  
 
ధనస్సు: పత్రికా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పికొట్టగలుగుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు.  
 
మకరం: చిన్న తరహా పరిశ్రమలలో వారికి సంతృప్తి కానవస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలను పొందగలుగుతారు.  
 
కుంభం: రచయితలకు, పత్రికా రంగాలలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. సోదరీసోదరులతో కలయిక పరస్పర అవగాహన కుదురును. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాల్లో పాతమిత్రులు, అయిన వారు తారసపడుతారు. 
 
మీనం: కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది.