ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (10:09 IST)

07-10-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. రావలసిన ధనం చేతికందటంతో?

మేషం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి.

మేషం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. స్త్రీలు ఆత్మీయులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
వృషభం: బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది.  
 
మిధునం: కొంతమంది మీ వ్యాఖ్యాలను అపార్థం చేసుకుంటారు. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల రాకపోకల వలన గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.   
 
కర్కాటకం: విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకోన్నంత సంతృప్తి కానవస్తుంది. ఎంతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తికావు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
సింహం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కానివేళలో ఇతురుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలైదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం.  
 
కన్య: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాడిగా సాగుతాయి. రేషన్ డీలర్లకు అధికారుల నుండి ఇబ్బందులెదురవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. గృహ ప్రశాంతతకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి.    
 
తుల: హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. రుణయత్నాల్లో అనుకూలతలుంటాయి. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. తరుచు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టు విడుపు ధోరణితో ఒక సమస్య పరిష్కారమవుతుంది.  
 
వృశ్చికం: వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. బాకీలు వసూలు కాకపోవడంతో ఆందోళన చెందుతారు.  
 
ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వలన మాటపడవలసి వస్తుంది. తరచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబరాలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.  
 
మకరం: విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. శారీరక శ్రమ, మానసికాందోళన వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుండి బయటపడుతారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథాకాలకు మంచి స్పందన లభిస్తుంది.  
 
కుంభం: ఆర్థిక విషాయాల్లో సంతృప్తి కానరాదు. కళత్ర మెుండివైఖరి చికాకు కలిగిస్తుంది. పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోవారికి చికాకు తప్పదు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.  
 
మీనం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు లాభదాయకం. పోస్టల్, కొరియన్ రంగాల వారికి పనిభారం తప్పవు. స్త్రీలు టి. వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.