ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (09:09 IST)

08-10-2018 సోమవారం దినఫలాలు - స్త్రీలు- ప్రియురాళ్లతో మితంగా...

మేషం: చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలవారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితాలిస్తాయి.
 
వృషభం: దైవ దర్శనాలు, దీక్షలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్టాక్‌మార్కెట్ రంగాలవారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.   
 
మిధునం: బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. రచయితులకు, పత్రికారంగాలలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వలన మంచి గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలతో మితంగా సంభాషించండి. ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. 
 
కర్కాటకం: కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామాయ్నం చూసుకోవడం ఉత్తమం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
సింహం: ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. పత్రిక, ప్రైవేటి సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కోర్టు, భాగస్వామిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి.  
 
కన్య: ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. సోదరుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.  
 
తుల: పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందుకుంటారు. స్త్రీలకు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. విద్యార్థులకు ఒత్తిడి, సహచరులతో పట్టింపులు ఎదురవుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
వృశ్చికం: ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పారిశ్రామిక, రాజకీయావర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదాపడే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక బలీయమవుతుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
ధనస్సు: ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప కొన్ని విషయాలు ఆనందదాయకం కావు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. 
 
మకరం: ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం.  
 
కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయడం మంచిది కాదు. ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. గృహంలో ఏదైన వస్తువులు పోవడానికి ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. వస్త్ర, పచారీ, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.  
 
మీనం: కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాలలో వారికి కలిసివచ్చేకాలం. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. నూతనంగా చేపట్టే కార్యక్రమాల్లో ఒడిదుడుకులు తప్పవు. విదేశాలు వెళ్ళడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి.