Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

16-06-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు

Written By రామన్
Updated: ఆదివారం, 16 జూన్ 2019 (09:57 IST)
మేషం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు మీ హద్దుల్లో ఉండటం క్షేమదాయకం. నిరుద్యోగులకు ఆశాజనకం. 
 
వృషభం: మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం: ధనసహాయం, ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులో వ్యయం మీ అంచనాలను మించుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోను మెలకువ అవసరం. కుటుంబీకుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
సింహం: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. గుర్తింపు సదవకాశాలు లభిస్తాయి. 
 
కన్య: రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. మీ కళత్ర మొండి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కార్యసాధనలో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తిని ఇవ్వజాలవు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
తుల: చిన్నతరహా పరిశ్రమల వారికి అనుకూలమైన సమయం. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. కొత్త రుణాలు అన్వేషిస్తారు. మీ సంతానం కోసం ధనం ఖర్చులు అధికంగా వుంటాయి.  
 
వృశ్చికం: కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. చేపట్టిన పనుల్లో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు: స్త్రీలతో మితంగా సంభాషించండి. రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాస్త కష్టించే పనిచేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 
మకరం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలమైన కాలం. మొండిబాకీలు వసూలు కాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. 
 
కుంభం: సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.
 
మీనం: మీ యత్నాలకు ఆత్మీయులు సహాయ సహకారాలు అందిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నూనె, ఎండుమిర్చి వ్యాపారులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments