మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (11:57 IST)

18-12-2019 బుధవారం మీ రాశి ఫలితాలు (video)

లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినట్లైతే శుభం చేకూరుతుంది. 
 
మేషం : వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. రాజకీయాల్లో వారికి తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణాలు తీరుస్తారు. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. 
 
వృషభం: వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం: వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. 
 
కర్కాటకం:  స్థిరాస్తుల అమ్మకానికై చేయు ప్రయక్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. మీ విలువైన వస్తువులు ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. పాత మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
సింహం: రావలసిన ధనం రావడంతో బాకీలు తీరుస్తారు. వాహనం కొనుగోలుకు చేయు ప్రయత్నాల్లో జయం. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ సోదరులతు సంబంధ బాంధవ్యాలు బాగుగా వుంటాయియ విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి.
 
కన్య: బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. అయిన వారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు.
 
తుల: విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆధిపత్యం చెల్లదు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటివారి సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలోను స్వయంశక్తినే నమ్ముకోవడం మంచిది. రిప్రజెంటేటివ్‌లు, వారికి ఓర్పు అంకిత భావం ముఖ్యం. 
 
వృశ్చికం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో ఏమార్పు లేకపోవడంతో అశాంతికి లోనవుతారు. విద్యుత్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
ధనస్సు: పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయాల్లో వారు కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. పట్టుదలతో శ్రమించినట్లైతే అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రముఖుల సిఫార్సుతో పనులు సానుకూలమవుతాయి.
 
మకరం: బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. చెల్లింపులు, కరెన్సీ నోట్ల విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు కళా రంగాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం: విద్యార్థినుల మొండితనం అనర్ధాలకు దారితీస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దుబారా ఖర్చులు అదుపు సాధ్యం కాదు. స్త్రీల ఏమరుపాటు తనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. మీ సమస్యలకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది.
 
మీనం: ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీమ్‌లు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది.