Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

21-04-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే...

Written By రామన్
Updated: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (23:05 IST)
మేషం : ఇతరుల జోక్యం వల్ల మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఉమ్మడి వ్యాపారాల్లో పునరాలోచన అవసరం. 
 
వృషభం : స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు, పెట్టుబడులు లాభిస్తాయి. ధనవ్యయం చెల్లింపులకు సంభంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మిథునం : రాజకీయాల్లో వారు ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచడం మంచిది. కళాకారులకు రచయితలకు, పత్రికా రంగలోని వారికి అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ఉద్యోగం చేసే చోట కొత్త ప్రయోగం చేయవద్దు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఆహార విషయంలో వేళ తప్పి భుజించడం వల్ల ఆరోగ్యం భంగం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కన్య : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లాభిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చికాకులు తలెత్తినాగానీ నెమ్మదిగా సమసిపోతాయి. 
 
కన్య : దంపతుల మధ్య చిన్నచిన్న అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఎరువులు, కిరాణా, ఫ్యాన్సీ రంగాల వారికి కలిసివచ్చే కాలం. ఖర్చులు అధికం. వృత్తి, ఉద్యోగాలయందు ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. స్త్రీలకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. 
 
తుల : రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగంలా వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆడిటర్లకు, గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మంచి మార్పులు రాగలవు. ప్రలోభాలాకు లొంగవద్దు. గృహానికి మరమ్మతులు చేయించగలుగుతాం. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో జాగ్రత్త వహించండి. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
ధనస్సు : విదేశీ వస్తువులకై చేయు ప్రయత్నాలలో విజయం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. మీ సాయం పొందినవారే వేలెత్తి చూపుతారు. స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. 
 
మకరం : వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళకువ చాలా అవసరం. సంతానంపై చదువుల కోసం భవిష్యత్ ప్రణాలికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్మలను ఇరకాటంలో పెట్టవచ్చు. 
 
కుంభం : దైవకర్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంతత ప్రేమానుబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన బహుమతులు ఆందించి ప్రసన్నం చేసుకుంటారు. స్త్రీల ప్రతిభాపాటవాలకు సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం : ఉద్యోగస్తులు అధికారులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాలు తప్పవు. వ్యవహార ఒప్పందాల్లో ఖచ్చితంగా ఉండాలి. నూతన వ్యాపారాలు, వృత్తులు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడాలి. స్త్రీలకు నాణ్యత, ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments