మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (18:31 IST)

19-04-2020 ఆదివారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివితే శుభం

మేషం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో రాణిస్తారు. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించండి. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు పాల్గొంటారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. 
 
మిథునం : అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు వ్యవహారంలో మెలకువ వహించండి. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. చదువు, వ్యాపారాలపై దృష్టి పెడతారు. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. ఆపరేషన్లు సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల, ప్రోత్సాహం లభిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. 
 
సింహం : ఆర్థిక విషయాల్లో అనుకొని ఇబ్బందులు ఎదురవుతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదురవుతాయి. కీలకమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. రావలసిన ధనం కొంత మందు వెనుకలగానైనా అందుతుంది. 
 
కన్య : బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధిపొందుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
తుల : కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. 
 
వృశ్చికం : స్థిరచరాస్తుల క్రయ, విక్రయాలు అనుకూలిస్తాయి. రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. 
 
ధనస్సు : మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. ఒప్పందాలు, రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. 
 
మకరం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటాయి. పథకాలు కార్యరూపం దాల్చుతాయి. 
 
కుంభం : రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకా లెదరవుతాయి. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కొత్తదనాన్ని కోరుకుంటారు. 
 
మీనం : ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సంబంధించిన సమాచారం అందుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.