మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

14-04-2020 మంగళవారం దినఫలాలు - దక్షిణామూర్తిని పారాయణం చేస్తే...

మేషం : కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మనోభావాలు బయటికి వ్యక్తం చేయకండి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృషభం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు ఆటంకాలు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. ముఖ్యుల నుండి ధన సహాయం లభిండంతో ఒక అడుగు ముందుకేస్తారు. 
 
మిథునం : ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల తోడ్పాటు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : సిమెంట్, ఇటుక, కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు మీకు అనుకూలించవు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. వ్యవసాయ, తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. 
 
సింహం : విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి ముఖ్యులకు బహుమతులు అందచేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. అలౌకి విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులు తప్పవు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మిత్రులో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. 
 
తుల : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. ఎదుటివారి నుంచి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. నిర్మాణ పనులలో ఒత్తిడి, జాప్యం వల్ల చికాకులు తప్పవు. షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్యం విషయంలోనూ ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ నిర్లక్ష్యం, మతిమరుపు కారణంగా సమస్యలెదుర్కొనక తప్పదు హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
మకరం : పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. విలువైన పత్రాలు, రశీదులు ఆదుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వాహనచోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. 
 
కుంభం : స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలుచేస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో కొంత నిరాశను ఎదుర్కొంటారు. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకులు తప్పవు. ఊహించని చికాకులు తలెత్తినా తెలివితే పరిష్కరిస్తారు. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. పాత బాకీలు తీరుస్తారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత ప్రధానం.